![]() |
![]() |

"సేవ్ ట్రీస్ సేవ్ వాటర్" నినాదంతో ఇండియాలోని అన్ని ప్రాంతాలకు సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్లే రాము గురించి అందరూ వినే ఉంటారు చూసే ఉంటారు. అతను రీసెంట్ గా ఆట సందీప్ ని కలిసాడు. "సందీప్ అన్నను కలిసాను. దూరం నుంచి చూస్తున్నాను. చూసి సందీప్ మాష్టరా కాదా అనుకున్నాను. చూసి షాకయ్యాను. నా సైకిల్ ని పార్కింగ్ లో పెట్టేసి మాష్టర్ ని కలవడానికి వచ్చాను.
మెహ్రన్గఢ్ ఫోర్ట్ రాజస్థాన్ స్టేట్ జోధ్ పూర్ లో నేను సందీప్ అన్నను కలిసాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది." అని రాము చెప్పేసరికి " నిజం చెప్పాలి అంటే ముందు నాకు చాలా సంతోషంగా ఉంది రాముని ఇలా కలిసినందుకు. 24 రాష్ట్రాలు, 14 నెలల్లో సైకిల్ మీద 24 వేల కిలోమీటర్లు వరకు చెట్లను నరకొద్దూ అనే నినాదంతో సేవ్ ట్రీస్ - సేవ్ వాటర్ అనే మోటోతో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి వారిని కలిసి మోటివేట్ చేస్తూ ఇప్పుడు రాజస్థాన్ వచ్చాడు. నాకు రాముని చూడడం చాలా గర్వంగా ఉంది. మన తెలుగోడు..18 ఏళ్ళ వయసులో సైకిల్ మీద ఇన్ని వేల కిలోమీటర్లు తిరుగుతూ ఇంతమందిని మోటివేట్ చేస్తున్నాడు అంటే నిజంగా మనమంతా గర్వించాల్సిన విషయం. ఆల్ ది బెస్ట్ రాము. ఇంటర్నేషనల్ లెవెల్ కి నువ్వు వెళ్లిపోవాలని విష్ చేస్తున్నా" అని చెప్పాడు ఆట సందీప్. ఒకప్పుడు ఢీ షోతో మంచి పేరు తెచ్చుకున్న సందీప్ మాష్టర్ కి ఆ ప్రోగ్రాం టైటిల్ కాస్తా ఇంటి పేరుగా మారిపోయింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లి మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. సందీప్ అతని వైఫ్ జ్యోతి ఇద్దరూ చిరు అభిమానులు. అందుకే వాళ్ళు ఎక్కువగా చిరు సాంగ్స్ ని వాళ్ళ ఓన్ స్టైల్ లో కంపోజ్ చేసుకుని వాటిని రీల్స్ గా వీడియోస్ గా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. ఇక సందీప్ కొన్ని మూవీస్ లో నటించాడు. సందీప్ ఇప్పటికే చిన్న సినిమాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసాడు.
![]() |
![]() |